నూతన సచివాలయం నిర్మించడానికి ప్రస్తుత సెక్రటెరియట్ కార్యాలయాలను తరలిస్తున్నారు. రహదారులు- భవనాల మంత్రి, ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలు నిన్ననే తరలివెళ్లగా పేషీ, మిగతా విభాగాలు ఇవాళ తరలి వెళ్లాయి. ఇతర శాఖల తరలింపు కూడా కొనసాగుతోంది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా కార్యాలయం బీఆర్కే భవన్కు మార్చారు.
రెండు రోజుల్లో పూర్తి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కార్యాలయాన్ని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నేటిలోగా సీఎస్ కార్యాలయ తరలింపు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి బీఆర్కే భవన్ నుంచే సీఎస్ కార్యకలాపాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మిగతా శాఖలను కూడా వడివడిగా తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల్లోగా మొత్తం తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నో