Go Green event: పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు అందరి బాధ్యతగా మారింది. మొక్కలు పెంచాలి.. చెట్లను సంరక్షించుకోవాలి.. అనే నినాదం చాలామంది ప్రకృతి ప్రేమికులను ఈ యజ్ఞంలో భాగమయ్యేలా చేస్తుంది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్ షేక్‌పేట ప్రాంతంలోని ఆదిత్య ఎంప్రెస్ టవర్స్ వాసులు తమవంతు బాధ్యతగా మొక్కల పెంపకంపై మెలకువలు నేర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.
అపార్ట్మెంట్ వాసుల కోసం ప్రకృతి ప్రేమికులు డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం.. మొక్కల పెంపకంలో ప్రీ వర్క్ షాప్ నిర్వహించారు. బోన్సాయ్ మొక్కలను ఎలా సేకరించాలి.. ఎలా పెంచాలి అనే అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరికి మొక్కలపై అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకురాలు సంగీత తెలిపారు. వర్క్‌షాప్‌కు హాజరైన వారికి ఐ ఫర్ యూ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈరోజు మనం గో గ్రీన్ ఆదిత్య అనే కార్యక్రమం చేపట్టాం. మన సనాతన ధర్మంలో భాగంగా చెట్లను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయని చెప్పారు. అందుకే ఐ ఫర్ యూ సంస్థ ద్వారా చెట్లను పంపిణీ చేయడం జరిగింది. -హిమాన్షు చరణ్, ఐ ఫర్ యూ సంస్థ ఎండీ
నాకు చాలా సంవత్సరాల నుంచి బొన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నాను. ఈరోజు బొన్సాయ్ మొక్కలను ఎలా రక్షించుకోవాలి. వాటికి అవలంబిచాల్సిన పద్ధతుల గురించి తెలియచేస్తాను. -డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం, ప్రకృతి ప్రేమికులు
గో గ్రీన్ ఆదిత్య కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.బొన్సాయ్ మొక్కల గురించి సయ్యద్ అబ్దుల్ హకీం తెలియచేస్తారు. అందులో భాగంగా బొన్సాయ్ మొక్కలను పంపిణీ చేస్తున్నాం. - సంగీత, నిర్వాహకురాలు
ఇదీ చదవండి: 'అమిత్ షా తన పేరును అబద్దాల బాద్షా అని మార్చుకోవాలి'