ETV Bharat / state

'సహకారమివ్వండి... రక్షణ కవచంలా మారుతాం' - SWATHI LAKRA ON DISHA INCIDENT

దిశ హత్యాచారం వంటి ఘటనలు పునరావృతం కాకుండా.... అన్ని రకాలుగా చర్యలు చేపట్టనున్నట్లు మహిళా భద్రతా విభాగ అధిపతి స్వాతి లక్రా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అకాతాయిలను గుర్తించి కౌన్సెలింగ్​ ఇస్తామని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో పాటు... గ్రామస్థుల సహకారంతో... మూలమూలనా భద్రతనిచ్చేలా చర్యలు చేపడతామని భరోసానిచ్చారు.  మహిళలకు గౌరవం ఇచ్చే మనస్తత్వం చిన్నప్పటి నుంచే అలవాటు చేసే విధంగా... విద్యాశాఖతో కలిసి విద్యార్థులకు ఆన్​లైన్ కోర్సులను త్వరలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దిశ ఘటనతో భయపడాల్సిన పనిలేదని... అన్నివేళలా భద్రత కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్న షీటీమ్స్​ ఇన్​ఛార్జి స్వాతి లక్రాతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

SHE TEAMS INCHARGE SWATHI LAKRA RESPONDED ON DISHA INCIDENT AND WOMEN SAFETY IN TELANGANA
SHE TEAMS INCHARGE SWATHI LAKRA RESPONDED ON DISHA INCIDENT AND WOMEN SAFETY IN TELANGANA
author img

By

Published : Dec 5, 2019, 6:08 AM IST

'సహకారమివ్వండి... రక్షణ కవచంలా మారుతాం'

'సహకారమివ్వండి... రక్షణ కవచంలా మారుతాం'

ఇవీ చూడండి: 'మీకోసమే మేమున్నాం... అన్ని వేళలా మీ తోడుంటాం'

TG_Hyd_46_04_CPM_Raghavulu_PC_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్‌ OFC నుంచి వచ్చింది. ( ) దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీ అమలును సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. ఎన్‌ఆర్సీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామనడం ప్రమాదకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. దేశంలో ఏ మూలన విదేశీయులు ఉన్నా... గుర్తించి పంపించేందుకు అనేక పద్దతున్నాయని రాఘవులు పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహారిస్తోందని ఆయన ఆరోపించారు. జనవరి 8న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బందుకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ నిరంకుశ చర్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆర్టీసీకి వందకోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్‌ సమ్మెకు ముందే ఇస్తే ఇంత నష్టం వాటిల్లేదికాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాని తెలిపారు. దిశ ఘటనను ఖండిస్తూ ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామన్నారు. బైట్: బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బైట్: తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.