ETV Bharat / state

వైఎస్​ షర్మిల పాదయాత్రకు పోలీసుల అనుమతి.. అప్పటి నుంచే యాత్ర..! - వైఎస్‌ షర్మిల పాదయాత్రకు అనుమతిచ్చిన పోలీసులు

YS Sharmila Padayatra: వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. వరంగల్‌ పోలీసులు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల 2 నుంచి 18 వరకు యాత్ర కొనసాగనుంది.

ys sharmila
వైఎస్‌ షర్మిల
author img

By

Published : Jan 27, 2023, 2:12 PM IST

YS Sharmila Padayatra: వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్రకు వరంగల్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. వ్యక్తిగత దూషణలు చేయరాదని, ఇతర పార్టీలు, కులాలు, మతాలను కించపరుస్తూ.. వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంటూ 14 షరతలతో అనుమతిచ్చారు. వచ్చే నెల 2 నుంచి 18 వరకు నిర్వహించుకోవడానికి అనుమతించారు. వరంగల్ జిల్లా శంకరమ్మ తండా నుంచి.. నెక్కొండ, పర్వతగరి, వర్ధన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఘన్​పూర్, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం వరకూ యాత్ర చేసేందుకు వరంగల్ సీపీ అనుమతించారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడులు.. పరస్పర ఘర్షణలు జరిగి ఉద్రిక్తతలకు దారి తీయడంతో.. షర్మిల ప్రజా ప్రస్ధానం పాదయాత్రను గత ఏడాది నవంబర్ 28న వరంగల్ జిల్లా శంకరమ్మ తండా వద్ద నిలిపివేశారు. షర్మిల ప్రయాణించే కారవాన్​పై పెట్రోల్‌ పోసి దాడి చేసి తగులబెట్టారు. చివరకు శాంతి భద్రతల విఘాతం కలుగుతోందంటూ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆ మరునాడు 29న ధ్వంసం చేసిన వాహనాలతో హైదరాబాద్ ప్రగతి భవన్ వైపు షర్మిల వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

YS Sharmila Praja Prasthana Padayatra: దీంతో మరోసారి అలజడి రేగింది. వాహనం దిగేందుకు షర్మిల ససేమిరా అనడంతో.. ఆమెను కారుతో సహా పోలీసులు ఎస్సార్​నగర్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. షర్మిలతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయద్దని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించద్దని పరతులు విధిస్తూ.. పాదయాత్రకు హైకోర్టు అనుమతించినా యాత్ర సాగలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 2 నుంచి షర్మిల ప్రజా ప్రస్ధాన యాత్ర చేసేందుకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

పాదయాత్ర కోసం నిరాహార దీక్ష: ప్రజాప్రస్థాన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత నెలలో ఆమరణ నిరాహర దీక్ష చేశారు. లోటస్‌పాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి.. ఆందోళన చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన దీక్ష విరమించాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో బలవంతంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి పంపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.