ETV Bharat / state

ఆ విషయంలో పాలకులు మాట తప్పారు: షర్మిల - Sharmila latest news today

రాష్ట్రంలో ముస్లింల జీవితాలు మారుతాయని ఆశించారు. కానీ..ఏమైంది? గంగా, జమునా, తహసీబ్ అని పాలకులు గొప్పలు చెప్పారు. తెలంగాణ వస్తే.. ముస్లీంలకు న్యాయం జరుగుతుందన్నారు? కానీ ముస్లీంల పరిస్థితులు ఏమైనా మారాయా అని వైఎస్ షర్మిల నిలదీశారు. లోటస్ పాండ్​లో ఇవాళ ముస్లీం మైనార్టీ సోదరులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు.

sharmila-comments-on-trs-government-on-muslim-reservation-system
ఆ విషయంలో పాలకులు మాట తప్పారు: షర్మిల
author img

By

Published : Mar 22, 2021, 8:44 PM IST

Updated : Mar 22, 2021, 9:56 PM IST

ఆ విషయంలో పాలకులు మాట తప్పారు: షర్మిల

రాష్ట్రంలో ముస్లీంలను రిజర్వేషన్ల విషయంలో పాలకులు మోసం చేశారని వైఎస్​ షర్మిల ఆరోపించారు. ముస్లింల బతుకులేమైనా మారాయా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉందని.. అందులో 57 వేల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యిందన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తోందని షర్మిల ప్రశ్నించారు. వాటిని విడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? పాతబస్తీలో కొత్తగా ఏమైనా అభివృద్ది జరుగుతుందా? అని నిలదీశారు.

వైఎస్ఆర్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని పాలకులు మాట ఇచ్చి.. దాన్ని నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడి పాలకులు ముస్లీంలను ఓటు బ్యాంక్​గా మార్చుకున్నారని.. కేంద్రంలో ఉన్న పాలకులు ముస్లీంలను హేట్ బ్యాంక్​గా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది మారాలి, మీరు మార్చాలన్నారు. రాజన్న బిడ్డగా మీ పక్షాన పోరాటం చేయడానికి తాను సిద్దమని షర్మిల హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : 'వ్యాక్సిన్‌ వేయించుకోడానికి ప్రజలు ముందుకు రావడం లేదు'

Last Updated : Mar 22, 2021, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.