శంషాబాద్ పశువైద్యురాలి హత్యకు నిరసనగా ఈనెల 10న షరబ్ హఠావో- తెలంగాణ బచావో అనే డిమాండ్‌తో నగరంలో ఒక రోజు ఆటో బంద్‌కు ఐకాస కన్వీనర్ అమనుల్లా ఖాన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉండి ఉంటే, ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. మద్యం మత్తులోనే నలుగురు దుండగులు ఈ కిరాతకానికి పాల్పడ్డారని అన్నారు.
రోడ్డు ప్రమాదాలు, సామాజిక నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యమని, దాని వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకుంటే 10న ఆటో డ్రైవర్లు అందరూ బంద్‌లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం : రేవంత్