ఆమె కూతురు రుక్సార్.. డబీర్‌పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక నేతల సహకారంతో విదేశాంగ మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రూ. 2 లక్షలు చెల్లించాలని లేకపోతే మరో మహిళను అక్కడికి పంపించాలని షేక్ మొండికేశాడు. ఒమన్ రాయబార కార్యాలయ సాయంతో బాధితురాలిని స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నకిలీ ఏజెంట్లతో జాగ్రత్త!
ఆర్థిక ఇబ్బందులున్న మహిళలు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి కష్టాల నుంచి గట్టెక్కాలనుకుంటున్నారు. నకిలీ ఏజెంట్లు రంగంలోకి దిగిసొమ్ము చేసుకుంటున్నారు. ఏజెంట్ల మోసాలతో చాలా మంది మహిళలు షేక్‌ల వద్ద పని చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవీ చూడండి:ఫేస్బుక్లో మరో పోస్ట్.. స్పందించిన సీఎంఓ