హైదరాబాద్ షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అంతా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ల కోసం వస్తున్న వారితో కిక్కిరిసిపోయింది. విషయం గుర్తించిన ఆధికారులు కరోనా పరీక్షలు చేసే కేంద్రాన్ని ఆస్పత్రి ఎదుట గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోకి తరలించారు.
కరోనా పరీక్షలు వస్తున్న వారి నుంచి వ్యాక్సిన్ కోసం వస్తున్న ప్రజలకు వైరక్ సోకకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేసినట్లు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ... జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన షాద్నగర్ సేవా భారతి సంస్థ సభ్యులు కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం వస్తున్న వారికి తాగునీరు అందించారు.
ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు