పవిత్ర రంజాన్ మాసంలో లబ్ధిదారులకు ఉపయోగపడుతాయనే ఉద్దేశంతో షాదీముబారక్ చెక్కులను వేగంగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో 2020-21 ఏడాదికి అర్హులైన 290మంది లబ్ధిదారుల కోసం రూ.2,90,33,600 నిధులు మంజూరు అయ్యాయని వివరించారు.
ఆసీఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను మంగళవారం అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని రంజాన్ మాసంలో కుటుంబ అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో కలెక్టర్ హల్చల్