ETV Bharat / state

కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు: ఎస్​ఎఫ్​ఐ - రైతులకు మద్దతుగా హెచ్​సీయూలో విద్యార్ధుల ధర్నా

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి విభాగం ఆరోపించింది. దిల్లీలో ఆందోళన చేపడుతోన్న రైతులకు మద్దతుగా ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టింది.

sfi  students  go on one day  hunger strike in support of farmers agitation in Delhi
కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు: ఎస్​ఎఫ్​ఐ
author img

By

Published : Feb 8, 2021, 8:16 PM IST

దేశ వ్యవసాయరంగ అభివృద్ధి కోసం స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్​ఐ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు దిల్లీలో రైతులు చేపడుతోన్న ఆందోళనకు మద్దతుగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టింది.

కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి విభాగం నేతలు ఆరోపించారు. భాజపా ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు కోరుతున్న మద్దతు ధరను అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: సూర్యాపేట భాజపా అధ్యక్షుడు అరెస్ట్.. గుర్రంబోడు ఘర్షణే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.