ETV Bharat / state

'విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి' - ఎస్ఎఫ్ఐ డిమాండ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అనుసరిస్తున్న వివక్షతను విడనాడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను దూరం చేయకుండా.. . విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించాలని కోరారు.

Sfi protest to allocate more budget for education in Hyderabad
'విద్యకు పెద్దపీట వేస్తూ.. అధిక నిధులు కేటాయించాలి'
author img

By

Published : Mar 12, 2020, 10:08 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగం పట్ల అనుసరిస్తున్న వైఖరి ఫలితంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యకు దూరం అవుతున్నారని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను ఆరోపించారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం విద్యారంగానికి నిధులు తగ్గిస్తూ వస్తోందని.. అదే ధోరణిని రాష్ట్ర ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేయడం ఫలితంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు. విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేయనీయకుండా అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలని వాపోయారు.

'విద్యకు పెద్దపీట వేస్తూ.. అధిక నిధులు కేటాయించాలి'

ఇదీ చూడండి: తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.