ETV Bharat / state

Sexual Harassment on Minor Girls in Hyderabad : చాక్లెట్ ఆశచూపించి మైనర్​ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై పోక్సో కేసు - Telangana latest news

Sexual Harassment on Minor Girls in Hyderabad : మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్​లో చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఓ మైనర్ బాలికపై సయ్యద్ రవూఫ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Rape on Minor Girl in Hyderabad
BRS Leader Rape on Minor Girl in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 5:17 PM IST

Sexual Harassment on Minor Girls in Hyderabad : సమాజంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు కొందరు. వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు మరికొందరు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

Gang Rape on Minor Girl in Meerpet : హైదరాబాద్‌లో దారుణం.. ఇంట్లోకి దూరి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి మైనర్ బాలికపై (Rape on Minor Girl).. సయ్యద్ రవూఫ్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ రవూఫ్ అనే వ్యక్తి బీఆర్​ఎస్​ నాయకుడిగా కొనసాగుతున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి వీకర్ సెక్షన్ కాలనీ బ్రాహ్మణవాడలో నివాసముంటున్నారు. అదే బస్తీలో చిన్న కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ దుకాణంలోకి వచ్చే చిన్న పిల్లలకు చాక్లెట్ ఆశ చూపించి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అక్కడున్న బస్తీ వాసులు గమనించి తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో సయ్యద్ రవూఫ్​ను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Minor Girl Gang Rape: ప్రేమ పేరుతో లోబరచుకుని.. దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. అవమాన భారంతో..!

ఇటీవల పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.. సెల్‌ఫోన్ ఇస్తామని ఆశ చూపించి ఓ మైనర్ బాలికపై తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. బతుకు దెరువు కోసం ఓ కుటుంబం 7 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చింది. రోజువారీలాగే ఆ తల్లిదండ్రులు.. తమ పాపను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారు. ఈ క్రమంలోనే వీరి ఇంటికి సమీపంలో శివకుమార్‌ కుటుంబం నివసిస్తోంది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆ మైనర్ బాలికను శివకుమార్‌(45), అతని కుమారుడు శ్యామెల్‌ (19) గమనించారు. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారికి సెల్‌ఫోన్‌ ఇస్తామని ఆశ చూపించి.. తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌.. ఆలస్యంగా వెలుగులోకి..!

బాలికకు లైంగిక వేధింపులు.. నిందితుడికి 25ఏళ్ల జైలుశిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.