ETV Bharat / state

Sexual Harassment in Hakimpet Sports School : హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల కలకలం.. ఓఎస్డీ సస్పెండ్

Sexual Harassment in Hakimpet Sports School : హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారనే కథనాలు సంచలనంగా మారాయి. వెంటనే స్పందించిన సర్కారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణపై వేటు వేసింది. కొత్త ఓఎస్డీని నియమించింది. విచారణ చేపట్టిన బాలల హక్కుల కమిషన్.. బాలికల నుంచి వివరాలు సేకరించింది. పాత ఓఎస్డీ హరికృష్ణ, సహాయక సిబ్బంది, కోచ్‌లను ప్రశ్నించింది. కమిషన్‌ నివేదిక రాగానే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

Hakimpet Sports School OSD suspended
Hakimpet Sports School Incident
author img

By

Published : Aug 13, 2023, 1:06 PM IST

Updated : Aug 13, 2023, 7:07 PM IST

Sexual Harassment in Hakimpet Sports School హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల కలకలం ఓఎస్డీ సస్పెండ్

Sexual Harassment in Hakimpet Sports School : మేడ్చల్‌ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ ఓఎస్డీ హరికృష్ణ.. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం సృష్టించాయి. బాలికలకు వేధించడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతూ ట్వీట్‌ చేశారు. విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (Minister Srinivas Goud).. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. విచారణ చేపట్టామని.. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్​గౌడ్ స్పషం చేశారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వదలం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఘటన రుజువైతే జైలుకు పంపిస్తాం.. అవసరమైతే ఉరి తీయిస్తాం. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. - శ్రీనివాస్‌గౌడ్‌, క్రీడల శాఖ మంత్రి

వేధించిన యువకుడికి మహిళ చెప్పు దెబ్బలు.. అరగంట పాటు!

OSD Harikrishna React on Hakimpet Sports School incident : బాలికపై లైంగిక వేధింపులకు ((Sexual Harassment) పాల్పడ్డారనే ఆరోపణలను.. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ (Hakimpet Sports School ) ఓఎస్డీ హరికృష్ణ ఖండించారు. పాఠశాలలో ఇప్పటి వరకు అలాంటి ఘటనలు, ఆరోపణలు రాలేదని తెలిపారు. పాఠశాల ప్రతిష్ఠ దెబ్బ తీసేలా పత్రికలో వచ్చిన కథనం బాధాకరమని చెప్పారు. స్కూల్​లో అడ్మిషన్స్​ జరుగుతున్నాయని.. ఈ సందర్భంలో ఇలాంటి వార్తలతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. తనపై కుట్ర పన్నారని ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు.

పాఠశాలలో ఇప్పటి వరకు అలాంటి ఘటనలు, ఆరోపణలు రాలేదు. ఇవన్నీ అవాస్తవాలు. స్కూల్​లో అడ్మిషన్స్​ జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. తనపై కుట్ర పన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను - హరికృష్ణ, ఓఎస్డీ, హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌

మరోవైపు లైంగిక వేధింపుల విషయం తెలుసుకున్న బాలల హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. కమిషన్‌ సభ్యురాలు.. బాలికల నుంచి వివరాలు సేకరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ, సహాయ అధికారులు, కోచ్‌లు, వార్డెన్లను ప్రశ్నించారు. మేడ్చల్‌ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్డీఓ సహా మిగతా అధికారులు కూడా విచారణలో పాల్గొన్నారు. ఈ ఘటనలో పాత ఓఎస్డీ హరికృష్ణపై వేటు వేసిన ప్రభుత్వం.. అతని స్థానంలో సుధాకర్‌ను నియమించింది.

పొద్దున్నే హాయ్.. రాత్రి గుడ్‌నైట్‌ చెప్పాలి.. కీచక ఉపాధ్యాయుల ప్రవర్తన

ఈ ఘటనపై స్పందించిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. బాలికలపై వేధింపుల్ని ఉపేక్షించకూడదన్నారు. క్రీడల్లోకి ఆడపిల్లలు తక్కువగా వస్తున్నారని.. ఇలాంటి ఘటనలతో తల్లిదండ్రుల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సమగ్ర విచారణ తర్వాత.. క్రీడ శాఖకు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. నిజ నిర్ధారణ తర్వాత.. ఆరోపణలు రుజువైతే పాత ఓఎస్డీ హరికృష్ణ, అతడికి సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

శంషాబాద్ ఎయిర్​పోర్టులో కామాంధుడు.. మహిళలపై లైంగిక వేధింపులు

పాఠాలు చెప్పాల్సిన నోటి నుంచి కామపురాణం.. వెలుగులోకి ఆడియో

Last Updated : Aug 13, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.