Richest Cricketer Retirement Aryaman Birla : సాధారణంగా ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ క్రికెటర్ ఎవరు అంటే? సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ, ధోనీ పేర్లు వినిపిస్తుంటాయి. అయితే వీరిని మించిన సంపన్న క్రికెటర్ ఒకడున్నాడు. అతడు తన 22 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు! అతడి ఆస్తి ఏకంగా రూ.70 వేల కోట్లు! అవును మీరు చదివింది నిజం.
ఇంతకీ అతడు ఎవరంటే? - ఆ రిచెస్ట్ క్రికెటర్ పేరు ఆర్యమాన్ బిర్లా. బిలియనీర్ కుమార మంగళం బిర్లా తనయుడే అతడు. సాధారణంగా బిలియనీర్ వారసులు కూడా వ్యాపారాల్లోనే కొనసాగుతుంటారు. అయితే ఆర్యమాన్ బిర్లా మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే గతేడాది అతడు ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్‌కు డైరెక్టర్ అయ్యాడు. ఇంకా ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు కూడా అతడే డైరెక్టర్. దీంతో అదనపు బాధ్యతలు రావడంతో ఆర్యమాన్ బిర్లా, కేవలం 22 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు.
ఆర్యమాన్ బిర్లా కెరీర్ ఇలా - ఆర్యమాన్ 1997లో ముంబలో జన్మించాడు. మొదట జూనియర్ క్రికెట్ ఆడిన అతడు, ఆ తర్వాత రంజీ ట్రోఫీ స్థాయికి ఎదిగాడు. 2017లో మొదటి సారి మధ్యప్రదేశ్ తరఫున ఒడిశాపై రంజీ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
ఆ మ్యాచ్‌లో వరుసగా 16, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అనంతరం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచులో అతడు తొలి శతకాన్ని బాదాడు. బంగాల్‌తో మ్యాచ్‌లో 103 పరుగులు చేశాడు.
అతడి ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే - 2018 రంజీ ట్రోఫీలో శతకం బాదిన తర్వాత, అదే ఏడాది రాజస్థాన్ రాయల్స్ అతడిని వేలంలో కొనుగోలు చేసింది. అయితే రెండు సీజన్ల పాటు అతడు జట్టుతోనే ఉన్నా, తుది జట్టులో అతడికి చోటు రాలేదు. వరుసగా గాయాల బారిన కూడా పడ్డాడు. దీంతో అతడు 2019 తర్వాత క్రికెట్ ఆడలేకపోయాడు.
ఇక అదే ఏడాది డిసెంబర్లో నిరవధిక బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపిన ఆర్యమాన్ మళ్లీ బ్యాట్ పట్టుకోలేదు. ఫ్యామిలీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడతడి సంపద విలువ రూ.70 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా!.
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ షట్లర్ - రాజస్థాన్‌లో పీవీ సింధు వివాహం
బుమ్ర లాంటి పేసర్‌ను ఎదుర్కొన్నానని మనవళ్లకు చెబుతా : ట్రావిస్ హెడ్