2017లో బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న డేవిడ్ తాగి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. డేవిడ్ కూతురు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును విచారంచిన నాంపల్లి కోర్టు మంగళవారం నిందితుడికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కేసు దర్యాప్తులో నిందితుడికి శిక్ష పడేలా ఆధారాలు సేకరించిన బంజారాహిల్స్ ఎస్సై భరత్ భూషణ్‌ను సీపీ అంజనీ కుమార్ అభినందించారు.
ఇదీ చూడండి: హుజూర్నగర్ బరిలో సీపీఎం.. రేపు నామినేషన్