నివర్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి కడప జిల్లా రాజంపేటలో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రహదారులు మురుగుమయమయ్యాయి. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో కల్వర్టులు పొంగుతున్నాయి.
కడపలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కడప రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న మహా వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. ఆ సమయానికి ఒక కారు వెళ్లడంతో ఆ కారుపై చెట్టు కొమ్మ విరిగి పడింది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కారు దెబ్బతింది. విషయం తెలిసిన అధికారులు విరిగిన చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు... విద్యుత్తు పునరుద్ధరణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగరంలో చోటులేదు'