ETV Bharat / state

ఉల్లిధర: వినియోగదారులకు ఊరట... రైతులకు తీవ్ర నిరాశ - Onion farmers news

ఉల్లి ధరలు దిగిరావటం వినియోగదారులకు ఊరటనిస్తున్నా... రైతులను మాత్రం తీవ్రనిరాశకు గురిచేస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో ధరలు తగ్గడంపై ఆవేదన చెందుతున్నారు. సరైన గిట్టుబాటు ధరైనా లభించక నష్టాలు మూటగట్టుకుంటున్నారు. వాతావరణం ఆశాజనకంగా ఉండటంతోపాటు దిగుబడి సైతం పెరిగినా మార్కెట్‌లో మద్దతు ధర లభించకపోవడం ఉల్లిరైతుల ఆశలపై నీళ్లుచల్లినట్లవుతోంది.

ఉల్లిధర: వినియోగదారులకు ఊరట... రైతులకు తీవ్ర నిరాశ

author img

By

Published : Mar 18, 2021, 5:09 AM IST

ఉల్లిధర: వినియోగదారులకు ఊరట... రైతులకు తీవ్ర నిరాశ

ఉల్లి రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట పొలంలో ఉన్నప్పుడు ఆకాశాన్నంటిన ధరలు... తీరా మార్కెట్‌కు వచ్చే వరకు మాత్రం పడిపోవడం రివాజుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన హైదరాబాద్‌ మలక్‌పేట్ ఉల్లిగడ్డ మార్కెట్‌కు ఉల్లి పెద్దఎత్తున వస్తోంది. కొవిడ్ పరిస్థితుల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైతులు ఉల్లిగడ్డ తెచ్చి విక్రయిస్తుండటంతో మార్కెట్‌ రద్దీగా మారిపోయింది.

భారీగా వచ్చిన ఉల్లి...

బుధవారం ఒక్కరోజే 57 లారీల్లో సరుకు మార్కెట్‌కు వచ్చింది. వేలంలో క్వింటాల్‌ ఉల్లి ధర మోడల్ రేటు రూ. 1,600 నిర్ణయించగా... గడ్డినాణ్యత, పరిమాణం, నిల్వ సామర్థ్యాన్ని బట్టి క్వింటాల్‌ కనిష్ఠ ధర రూ. వెయ్యి, గరిష్ఠ ధర రూ. 2,300 చొప్పున పలికింది. అధిక ధరలు పలికిన ఉల్లి లోడ్లన్నీ కూడా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవే ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఉల్లిగడ్డ నాణ్యత సరిగా లేదన్న సాకుతో రైతులకు పెద్దగా గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

దక్కని రేట్లు...

ఈ ఏడాది ఉల్లిగడ్డ సీజన్ ప్రారంభమై 2 మాసాలు గడుస్తోంది. కర్నూలు, అనంతపురం, మెదక్, నారాయణఖేడ్, వికారాబాద్, తాండూరు, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ఇప్పుడు ఉల్లి మార్కెట్‌కు వస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న గడ్డకు మాత్రం క్వింటాల్ ధర రూ. 1,200 చొప్పున నిర్ణయించినప్పటికీ... ఆ రేట్లు రైతులకు దక్కడం లేదు.

పంట అమ్ముకోవడానికి అష్టకష్టాలు...

క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 800, గరిష్ఠ ధర రూ. 1,600 చొప్పున వేలంలో ధరలు లభించాయి. కొవిడ్‌ పరిస్థితుల్లో మంచి ధరలు వస్తాయన్న ఆశలతో పాత, కొత్త రైతులు ఈసారి ఉల్లి సాగు చేసినా... పెద్దగా ఫలితం లేకుండా పోయింది. గత ఏడాది ఇదే నెలలో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండటంతో పంట అమ్ముకోవడానికి కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. కనీసం ఈ ఏడాదైనా ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఎకరానికి రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టినా పరిస్థితి దారుణంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

నిలువు దోపిడీ...

మహారాష్ట్రలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న దృష్ట్యా అక్కడి రైతులు పెద్దఎత్తున రాష్ట్రానికి వచ్చి ఉల్లి అమ్ముకుంటున్నారు. కర్ణాటక రైతులదీ అదే పరిస్థితి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ కమీషన్ ఏజెంట్లు కుమ్ముక్కై రైతులను నిలువునా దోపిడి చేన్నారని ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్‌లో రైతులకు మద్దతు ధరలతో పాటు ఏ ఇతర శాఖల్లోనూ అన్యాయం జరగకుండా చూస్తున్నామని మార్కెట్‌ పాలకవర్గం చెబుతోంది.

రైతుబజార్లలో రూ. 25...

రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన ఉల్లి ధర రైతులను తీవ్రనిరాశకు గురిచేస్తుండగా జంట నగరాల్లోని రైతుబజార్లలో మాత్రం కిలోకి రూ. 25, కిరాణా దుకాణాల్లో రూ. 30 నుంచి 40 వరకు అమ్ముతున్నారు. మరో రెండు మాసాలపాటు నగరంలో ఉల్లి మార్కెట్‌ కొనసాగనున్న దృష్ట్యా కనీస మద్దతు ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండకపోవడచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చూడండి: సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్​ జోక్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.