ETV Bharat / state

'తక్షణమే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలి' - హైదరాబాద్ జిల్లా వార్తలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ను తక్షణమే అరెస్ట్ చేయాలని పలు దళిత సంఘాలు డిమాండ్​ చేశాయి. బషీర్ బాగ్ కూడలిలోని బాబు జగ్జీవన్​ రాం విగ్రహం ముందు ఆందోళన చేపట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని అతని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి... కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఏఐసీఎస్​ఎస్​ఓ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ కోరారు.

AICSS SO news
'తక్షణమే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలి'
author img

By

Published : Apr 3, 2021, 8:12 PM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిను వెంటనే అరెస్ట్ చేయాలని పలు దళిత సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. హైదరాబాద్​ బషీర్​ బాగ్ కూడలిలోని బాబు జగ్జీవన్​ రామ్ విగ్రహం ముందు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ (ఏఐసీఎస్​ఎస్​ఓ) నాయకులు ఆందోళన చేపట్టారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా శాలిబండ పోలీస్ స్టేషన్​లో తాము ఫిర్యాదు చేసినప్పటికీ... పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఏఐసీఎస్​ఎస్​ఓ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ తెలిపారు. దీంతో కోర్టును ఆశ్రయించి కేసు నమోదయ్యేలా న్యాయపోరాటం చేశామన్నారు.

గత నెలలో చల్లా ధర్మారెడ్డిపై కేసు నమోదు చేయాలని కోర్టు... శాలిబండ పోలీసులను అదేశించినప్పటికి కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చెయ్యడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, పిఓఏ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదయితే... 24 గంటల్లో అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలి. పోలీసులు చట్టంలో ఉన్న అంశాలను నీరుగారుస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని చల్లా ధర్మారెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి... కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో గవర్నర్​ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం స్పందించకపోతే ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చేదవండి: దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.