ETV Bharat / state

TRS RESOLUTIONS: 'ఆగమైపోతుందనే విమర్శలను దాటుకొని ఆదర్శంగా నిలిచాం'

author img

By

Published : Oct 25, 2021, 10:35 PM IST

ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ఆగమైపోతుందనే విమర్శలను దాటుకొని నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెరాస నేతలు స్పష్టం చేశారు. ప్లీనరీలో రాష్ట్ర, దేశ రాజకీయాలపై ఏడు తీర్మానాలు (TRS RESOLUTIONS) ప్రవేశపెట్టి.. ఆమోదం తెలిపింది.

TRS RESOLUTIONS
TRS RESOLUTIONS

'ఆగమైపోతుందనే విమర్శలను దాటుకొని ఆదర్శంగా నిలిచాం'

పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్​(KCR)కు అభినందనలు తెలుపుతూ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తొలి తీర్మానం (TRS RESOLUTIONS) ప్రవేశపెట్టగా గొంగడి సునీత బలపరిచారు. పాలనా సంస్కరణలతో అబ్బురపడేలా తెలంగాణను సాక్షాత్కరింపజేశారన్నారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించారు. తెరాస సాధించిన విజయాలు, ఆవిష్కరణలు-సాగునీరు, వ్యవసాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపు పరిపుష్టి తీర్మానాన్ని నిరంజన్‌రెడ్డి ప్రతిపాదించగా... అరికెల నాగేశ్వరరావు బలపరిచారు. 20 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలో ఎన్నో చారిత్రక విజయాలు సాధించామని గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధనతోపాటు తెలంగాణ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేశామని తెలిపారు.

సంక్షేమ తెలంగాణపై...

సంక్షేమ తెలంగాణ సాకారంపై కడియం శ్రీహరి తీర్మానం (TRS RESOLUTIONS) ప్రవేశపెట్టారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాఠోడ్‌ బలపరిచారు. అట్టడుగు వర్గాలు, అసహాయుల సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. ఆసరాతో పేదవర్గాలకు కనీస భద్రత లభించిందన్నారు. పరిపాలనా సంస్కరణలు, విద్యుత్‌రంగం, పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై కేటీఆర్(KTR) తీర్మానాన్ని ప్రతిపాదించారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు, గుండు సుధారాణి, కోవలక్ష్మి బలపరిచారు. పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని కేటీఆర్(KTR) అన్నారు.

దేశానికే దిక్సూచి...

దేశానికి దిక్సూచి దళితబంధు తీర్మానాన్ని మెతుకు ఆనంద్‌ ప్రతిపాదించగా.. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని బలపరిచారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయటంతోపాటు సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్గించటం లక్ష్యమని పునరుద్ఘాటించారు. రక్షణ కవచంగా దళిత రక్షణనిధి ఉంటుందన్నారు. వివిధ వ్యాపారాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీర్మానం (TRS RESOLUTIONS) ప్రతిపాదించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెలపల్లి రవీందర్‌రావు బలపరిచారు. ఆవాస విద్యను ప్రోత్సహించేలా పెద్ద ఎత్తున గురుకులాల ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు అందించి విదేశీ విద్యను ప్రోత్సహించామన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

డిమాండ్లు...

కేంద్ర ప్రభుత్వానికి తెరాస డిమాండ్లపై ఎంపీ నామ నాగేశ్వరరావు తీర్మానం (TRS RESOLUTIONS) ప్రవేశపెట్టగా మరో ఎంపీ రంజిత్‌ రెడ్డి బలపరిచారు. కులాలవారీగా బీసీ జనాభా లెక్కల్ని సేకరించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని తెలిపారు. తెరాస రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారం అధ్యక్షుడికి ఇస్తూ తీర్మానం (TRS RESOLUTIONS) ప్రవేశపెట్టారు. జిల్లా, నియోజకవర్గ కార్యవర్గాలను నియమించే అధికారం కల్పించారు. అధ్యక్షుడు లేనప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడికి అధికారాలుంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.