ETV Bharat / state

'నేటి నుంచే సేవా సప్తహ్.. గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ'

ఈనెల సెప్టెంబర్​ 17న ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలోని రోగులకు రాష్ట్ర భాజపా నాయకులు పండ్లను పంపిణీ చేశారు. నేటి నుంచి ఈనెల 20 వరకు సేవా సప్తహ్ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

భాజపా శ్రేణులు ప్రజా సేవకులుగా వ్యవహరించాలి : లక్ష్మణ్
author img

By

Published : Sep 14, 2019, 9:50 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సేవా సప్తహ్ పేరుతో కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 20 వరకు కొనసాగుతాయని అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు పేదలకు సహాయం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు అనగానే ఓట్లు, సీట్లు గెలుపోటములే కాదని..మానవతా దృక్పథంతో ప్రజా సేవ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక స్తోమత లేని వారికి సహకరించాలని, వైద్య శిబిరాల ఏర్పాటు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 150 జన్మదినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నివారణ చర్యలను చేపట్టనున్నట్లు వివరించారు.

భాజపా శ్రేణులు ప్రజా సేవకులుగా వ్యవహరించాలి : లక్ష్మణ్

ఇవీ చూడండి : మోదీ వస్తువుల వేలం షురూ.. మీరూ పొల్గొనండిలా...

Intro:సికింద్రాబాద్ యాంకర్..ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు పురస్కరించుకుని నేటి నుండి ఈనెల 20 వరకు సేవా సప్తహ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు..ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు అంతా ప్రజా సేవకులు గా మారి పేదవారికి సహాయం చేయాలని అన్నారు..రాజకీయ పార్టీలు అంటే ఓట్లు సీట్లు గెలుపోటములను కాకుండా మానవీయ విలువలను కాపాడేలా విధంగా మానవతా దృక్పథంతో ప్రజలకు ప్రజాసేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..చదువుకునే స్తోమత లేని వారికి ఉన్నత చదువులు అభ్యసించడానికి తోడ్పాటు నందించడం ,వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం మందుల పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు..ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టే విధంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్టోబర్ 2 నుండి మహాత్మాగాంధీ 150 జన్మదినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నివారణ చర్యలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు..బైట్ లక్ష్మణ్ తెలంగాణ భాజపా అధ్యక్షుడుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.