రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన వెబ్సైట్ 'సెట్విన్'ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉండగా.. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.
సెట్విన్ ఆధ్వర్యంలో... స్టెప్ ద్వారా 24కేంద్రాలు, ప్రాంచైజీల ద్వారా 60కేంద్రాల్లో మొత్తం 47అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
నిరుద్యోగులు ఉద్యోగ సమాచారం కోసం www.setwincareerandjobs.in వెబ్ సైట్ను సంప్రదించవలసిందిగా సూచించారు.
తెలంగాణలో సెట్విన్ సంస్థను ఆధునిక శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన ఈ సైట్ ద్వారా ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: 'ఆరేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాం'