ETV Bharat / state

'ఫొటో జర్మలిస్టు సలీం కరోనాతో మృతి చెందడం విచారకరం' - తెలంగాణ వార్తలు

సీనియర్​ ఫొటో జర్నలిస్టు ఎండీ సలీం మృతిపై రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కరోనాతో సలీం మృతి చెందడంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు.

senior photo journalist died of corona
ఫొటో జర్మలిస్టు సలీం కరోనాతో మృతి
author img

By

Published : May 2, 2021, 8:21 PM IST

సీనియర్ ఫ్రీలాన్స్ స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్ ఎండీ సలీం కరోనాతో మరణించడం విషాదకరమని.. రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 4 దశాబ్దాలుగా ఫొటో జర్నలిస్టుగా, అసెంబ్లీ ఫొటోగ్రాఫర్​గా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని దినపత్రికలకు తన సేవలందించారని.. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి కొనియాడారు.

నేటి తరం పాత్రికేయులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. సలీం ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

ఇదీ చదవండి: రేపు లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.