తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 97వ జయంతి వేడుకలను ఓయూలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు,ఓయూ పరిశోధన విద్యార్థి తలారి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బ్రేడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
నటుడుగా, ముఖ్యమంత్రిగా రెండు రంగాల్లో విజయం సాధించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్రీనివాస రావు పేర్కొన్నారు. నిత్యము పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మహానియుడని గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్‌కు" భారతరత్న" ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్‌తోపాటు తార్నాక, అడ్డగుట్ట తెతెదేపా నేతలు పాల్గొన్నారు.