తెలుగు జాతికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు, 4వ తరగతి ఉద్యోగులకు నిత్యావసర సరకులను అందించారు బాలకృష్ణ.
కరోనా కష్టకాలంలోనూ బసవతారకం ఆస్పత్రి పూర్తి స్థాయిలో సేవలు అందించిందని తెలిపారు. క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: ఎన్టీఆర్ దేశానికే ఆదర్శం.. అనుసరణీయం: బాలకృష్ణ