ETV Bharat / state

'అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి'​ - జీఎస్టీపై అధికారులు అవగాహన

అబిడ్స్​లో జంట నగరాల వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్నామని హైదరాబాద్ జిల్లా జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఈ సదస్సు మార్చి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

seminar on gst at abids hyderabad
జీఎస్టీపై అవగాహన సదస్సు... సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్​
author img

By

Published : Feb 28, 2020, 3:22 AM IST

హైదరాబాద్ అబిడ్స్​లో హైదరాబాద్, సికింద్రాబాద్ ఆభరణాల తయారీదారుల సంఘాల సభ్యులకు జీఎస్టీపై కేంద్ర అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జీఎస్టీ రిటర్న్​ దాఖలు చేయడంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఎదురవుతోన్న ఇబ్బందులు, సాంకేతిపరంగా వస్తోన్న అనుమానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జిల్లా జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు.

మార్చి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కమిషనర్​ వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ వర్గాలకు చెందిన వ్యాపారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, కన్సల్టెంట్లు, ఆడిటర్లు పాల్గొంటారని తెలిపారు.

జీఎస్టీపై అవగాహన సదస్సు... సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్​

ఇదీ చదవండి: వరుస హత్యల నిందితురాలు జాలీ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.