ప్ర. హైదరాబాద్‌లో నకిలీ విత్తనాలు అధిక సంఖ్యలో పట్టుబడుతున్నాయి. వీటిపై మీరు తీసుకుంటున్న చర్యలేమిటి?
జ. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి స్పెషల్ ఆపరేషన్ టీం రెండు చోట్ల తనిఖీలు నిర్వహించి, భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నాం. పాత విత్తనాలకే కలరింగ్ వేసి, వీటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించిన లేబుల్స్, బ్యాగ్స్ నంధ్యాల, కర్నుల్లో ప్రింట్ అవుతున్నాయని తెలిసింది. కర్నూల్లో అన్ని బ్రాండ్ల బ్యాగులు తయారు చేసి... వాటిలో ఈ కలరింగ్ చేసిన విత్తనాలను నింపి అమ్ముతున్నారు. మార్కెట్లో ఆ కంపెనీ ధర కంటే తక్కువ ధరకే వీటిని విక్రయిస్తున్నారు. దీంతే రైతులు తక్కువ ధరకే విత్తనాలు వస్తున్నాయని కొనుగోలు చేసి, మోసపోతున్నారు. మేము చేసిన తనిఖీల్లో సుమారు రూ.కోటి విలువైన విత్తనాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాం. వీరిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారించాలని కోరాం.
ప్ర. ఈ తరహా మోసగాళ్ళపై పోలీసుల నిఘా ఏవిధంగా ఉంది?
జ. పాత నేరస్తులపై ఎప్పుడూ స్పెషల్ ఆపరేషన్ టీం నిఘా ఉంటుంది. ఇందులో ప్రజల సహకారం కూడా కోరుతున్నాం. వారి నుంచి కూడా సమాచారం అందుతోంది. అందువల్ల వీళ్లను పట్టుకుంటున్నాము.
ప్ర. నకిలీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
జ. మా విచారణలో ఈ నకిలీ విత్తనాలు కర్నూల్లో తయారవుతున్నట్టు తెలిసింది. అక్కడ తయారయిన విత్తనాలను తీసుకొచ్చి తెలంగాణలో అమ్ముతున్నారు. నకిలీ విత్తనాలకు మూలం ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఉంది. అక్కడి నుంచి విత్తనాలు హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నాయి.
ప్ర. ఏ రకమైన ప్రణాళికతో మీరు ఈ నకిలీ దందాపై ముందుకు వెళ్తున్నారు?
జ. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో దీనికి ఐజీ నాగిరెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్నారు. కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌కు రవికుమార్ నోడల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చూడండి : 'నగల దుకాణానికి కన్నం.. యజమానికి పంగనామం '