ETV Bharat / state

టోక్యో ఒలింపిక్స్​కు మా క్రీడాకారిణిని ఎంపిక చేయండి: శ్రీనివాస్ గౌడ్

వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న 2020 ఒలింపిక్స్​కు బాక్సర్ నిఖత్ జరీన్​ను ఎంపిక చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి లేఖ రాశారు.

క్రీడాకారిణిని ఎంపిక చేయండి
author img

By

Published : Oct 22, 2019, 4:39 PM IST

బాక్సర్ జరీన్​ను టోక్యో ఒలింపిక్స్​కు ఎంపిక చేయాలి : శ్రీనివాస్ గౌడ్
అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్​లో ప్రతిభ కనబరుస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్​ను 2020 టోక్యో ఒలింపిక్స్​కు ఎంపిక చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి పేరును కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు, స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా డైరెక్టర్ జనరల్​ దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాల్యం నుంచే బాక్సింగ్ క్రీడలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తోందన్నారు.
అంచలంచెలుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఛాంపియన్స్ షిప్​ పోటీల్లో బంగారు పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని మంత్రి ప్రశంసించారు. ప్రతిభ కలిగిన నిఖత్ జరీన్​ను 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్​కు ఎంపిక చేస్తే పతకం సాధించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని
సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని జరీన్ తండ్రి జామీల్ అహ్మద్​కు మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి : పారిస్ ఒలింపిక్స్ లోగోను చూశారా..?

File : TG_Hyd_27_22_Srinivasgoud_Letter_AV_3053262 From : Raghu vardhan Note : Feed from Secretariat OFC ( ) బాక్సింగ్ లో మంచి ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో కనబరుస్తున్న రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను 2020 టోక్యో ఒలింపిక్స్ కు 51 కేజీల విభాగంలో ఎంపిక చేయాలని రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజుజు, స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాల్యం నుంచే బాక్సింగ్ క్రీడలో మంచి ప్రతిభను కనబరుస్తూ అంచలంచెలుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఛాంపియన్స్ షిప్ లలో బంగారు పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని మంత్రి ప్రశంసించారు. మంచి ప్రతిభను కలిగిన నిఖత్ జరీన్ ను 2020 లో టోక్యో లో జరిగే ఒలింపిక్స్ కు ఎంపిక చేస్తే ఒలంపిక్ పథకాన్ని సాధించే అవకాశం ఉందని అన్నారు నిఖత్ జరీన్ ఒలింపిక్స్ ఎంపిక పై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని నిఖత్ జరీన్ తండ్రి జామీల్ అహ్మద్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.