విజయనగరం జిల్లాలో కొమరాడ తహసీల్దార్ బోర్డు పెట్టుకుని కారులో నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని.. బలిజపేట మండలం పెదపెంకి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 260 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ వ్యవహారంలో ఇతరుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!