ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో కొంతమంది గోవును తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు. గోమాత లేనిదే ఏ ఇంట శుభకార్యం తలపెట్టరు.
గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకటరమణ, భారతి దంపతులు ఓ అడుగు ముందుకేసి గోవుకు శ్రీమంతం చేశారు. గ్రామానికి చెందిన ముత్తైదువులతో ఆవుకు పసుపు కుంకుమ పెట్టించారు. అనంతరం కర్పూర హారతులు పట్టి ఆవుకు పండ్లు, ప్రసాదాలు తినిపించారు.
ఇదీ చదవండి: కొత్త రూల్- చిన్న పిల్లలకు కేక్, ఐస్క్రీమ్ బంద్!