రాష్ట్రంలో విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. పంటలు వేయించి, కొనుగోలు చేసి.. రైతులకు రూ. కోట్ల బకాయిలు పెట్టి వేధిస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సూపర్ అగ్రి సీడ్స్ అనే హైదరాబాద్కు చెందిన సంస్థ.. రైతుల పేరిట రూ. కోట్లను బ్యాంకుల నుంచి అప్పు తీసుకుందని కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకుకు వెళ్తే.. రైతులకు, ఎకరానికి రూ. 50 వేలు కూడా ఇవ్వని బ్యాంకర్లు.. విత్తన కంపెనీలతో కుమ్మక్కై రూ. కోట్లు అప్పు ఇచ్చాయని మండిపడ్డారు.
నకిలీ విత్తన కంపెనీల విషయంలో.. అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని కోదండరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అడుగడుగునా ఉపాధి అవకాశాలు.. ఫుట్వేర్ రంగం సోపానాలు