మేషం
అద్భుతంగా ఈ సంవత్సరాన్ని మీరు మొదలుపెడతారు. వృత్తిజీవితంలో మీరు గొప్ప విజయాలు ఆశించవచ్చు. భవిష్యత్ కోసం కూడా మీరు ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ సంవత్సరం పనిలో మీరు స్థిరత్వాన్ని తీసుకువస్తారు. పనిలో ఒత్తిళ్లు, లేదా ప్రభుత్వం లేదా న్యాయపరమైన వ్యవహారాలు పెండింగ్‌లో ఉన్నట్టైతే వాటి పరిష్కారానికి మీరు ప్రాధాన్యత ఇస్తారు. మీ వృత్తి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు సామాజిక మాద్యమాలను ఉపయోగించుకుంటారు.
మీ సంబంధాలు చక్కగా ఉంటాయి. స్నేహితులతో కలవడం తగ్గిపోతుంది, ప్రేమించే వారితో అనుబంధం పెరుగుతుంది. ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో వ్యతిరేక లింగానికి చెందిన వారిని ఆకర్షించడంలో మీ సంభాషణ నైపుణ్యం మీకు ఉపయోగపడుతుంది. సంబంధాలకున్న ప్రాధాన్యతేంటో మీరు ఈ సంవత్సరంలో అర్థం చేసుకుంటారు. సెప్టెంబర్ తర్వాత మీ ఆదాయంలో అనిశ్చితి చోటుచేసుకునే సంకేతాలున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
బకాయిలు ఏమైనా ఉంటే వాటిని ఈ సమయానికి ముందే వసూలు చేసుకోవాలి. మే నెలలో మీరు ప్రభుత్వం లేదా సీనియర్ల నుంచి ప్రయోజనాలను ఆశించవచ్చు. మీ పెద్దల సహకారంతో మీ పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది కానీ ఈ సంవత్సరం చివరి దశలో దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి.
వృషభం
ఈ సంవత్సరం ప్రారంభం చాలా సాధారణంగా ఉంటుంది కానీ కాలం గడుస్తున్న కొద్ది అనుకూలంగా ఉన్నట్లు మీకనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఉత్సాహాన్ని మీరు చూస్తారు. కానీ ఉత్సాహం ఇతరులకు సమస్యగా మారకుండా మీరు చూసుకోవాలి. జీవిత పరమార్థాన్ని మీరు గ్రహిస్తారు. ఈ సంవత్సరమంతా ఉత్సాహంగా, ఆనందంగా సాగిపోతుంది. సంబంధాలను మీరు ఆనందిస్తారు. వ్యక్తిగత జీవితంలోని సానుకూలత మీ వృత్తిజీవితంలో ప్రతిబింబిస్తుంది.
జీవితమంటే ఒడిదొడుకలమయమని, కానీ ప్రతీ క్షణాన్ని ఆనందిస్తూ జీవిస్తేనే విజయం సాధించవచ్చనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో గనక మీరు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. చివరి మూడు నెలలు మీరు ఎటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయకండి. ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకునే ముందు మీ జీవిత భాగస్వామితో మాట్లాడి వారి ఆలోచనలు కూడా తెలుసుకోండి. ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో భాగస్వామితో మీరు బాగా సన్నిహితమవుతారు.
ఈ సమయంలో మీరు దుస్తులు, అభరణాలపై డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. భవిష్యత్ ప్రయోజనాల కోసం బంగారం లేదా వెండిలో కొంత పెట్టుబడి పెట్టండి. మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఆదాయ వనరుల్లో మార్పులు చూస్తారు. మొదటి నాలుగు నెలలు విద్యార్థులు తమ చదువుల విషయంలో తీవ్రంగా ఉండాలి. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అవసరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు మీరు ప్రయత్నిస్తున్నట్టైతే ఈ సంవత్సర చివరి దశలో జాప్యం చోటుచేసుకుంటుంది.
ఈ ఏడాది ప్రథమార్థంలో ఆరోగ్యంపై మీరు అధిక శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది ఆగస్టు వరకు ముక్కు, చెవి, గొంతు సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. ఈ ఏడాది చివరి నెలలో మీ మాటలు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మీ శత్రువులను కనిపెట్టుకొని చూడండి
మిథునంఈ సంవత్సరం మీకు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. మీ ఆర్థిక పరిస్థితి, కెరీర్, సంబంధాలకు సంబంధించిన వాస్తవాలను మీరు తెలుసుకుంటారు. మీ ప్రవర్తనలో స్పష్టత, పారదర్శకత ఉండేలా చూసుకోవాలి. చేతి వరకు వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయనే భావన మీకు కలుగుతుంది. జీవితం అలాగే ఉంటుందని, అలాంటి సందర్భాల్లో అధిక ఉత్సాహం, ఆశ, చక్కని ప్రణాళికతో మరింత శ్రమించాలని మీరు గుర్తుంచుకోవాలి. అలా చేయడం ద్వారా దీర్ఘకాలంలో మీ జీవితంలో మార్పులు చోటుచేసుకొని మీరు శక్తిమంతులుగా రూపొందుతారు.
భాగస్వామ్య వ్యాపారం మీకు అంతగా కలిసిరాదు. ఆర్థికపరమైన లావాదేవీల నిర్వహణలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా అప్పులు తీసుకోవాలనే ఆలోచన మీకు కలిగినా ఈ సంవత్సరం చివరి రెండు నెలలు మీరు అప్పులు తీసుకోకండి. సీనియర్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులతో మీరు వాదనలకు దిగకండి. కుటుంబసభ్యులతో మీరు సన్నిహితమవుతారు. మీ మాటల్లో మర్యాద, మాధుర్యం కనిపించాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కఠిన సంకల్పం వారికి ఆశించిన ఫలితాలు తీసుకువస్తుంది.
సంవత్సరం మధ్యలో సౌకర్యవంతమైన జీవనశైలి కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీరు మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం తలెత్తే స్వల్ప ఆరోగ్య సమస్యలతో శక్తిని కోల్పోయినట్టు మీకనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం.
కర్కాటకం
ఈ సంవత్సరం కష్టాలు, మధుర జ్ఞాపకాల కలబోతగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో మీరు జీవితంలో ముందుకు సాగాలి. ఈ సంవత్సరం మీలో భావోద్వేగాలు తగ్గుతాయి, దీంతో ప్రేమించే వారితో కొంత దూరంగా మసలుతారు. అలాంటి సందర్భాల్లో మీరు మిమ్మల్ని ప్రేమించే వారి దృష్టికోణంలో ఆలోచించాలి. ఉద్యోగులు పని ప్రదేశంలో మార్పు చూస్తారు, అది వారికి దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. మీపై పనిభారం పెరుగుతుంది, ప్రాజెక్టులు పూర్తిచేయడం ఇబ్బందిగా మారుతుంది.
ఫిబ్రవరి నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తర్వాత మీలో ఉత్సాహం పెరుగుతుంది, కానీ తోటి ఉద్యోగులతో ఎటువంటి సమస్యలు తెచ్చుకోకండి. భాగస్వామ్య వ్యాపారం లేదా పనుల్లో ఫిబ్రవరి తర్వాత నుంచి జాప్యం చోటుచేసుకుంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా వాటిని పూర్తి చేసుకోండి. సంబంధాలపరంగా ఈ సంవత్సరం మీరు అనుకూలంగా ఉంది. మీ ప్రేమ జీవితానికి ఈ సంవత్సరం మధ్యకాలం సానుకూలంగా ఉంటుంది. కొత్తగా ఏమైనా చేసి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. పరస్పరం సంతోషంగా ఉండేందుకు మీరు, మీ భాగస్వామి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. సెప్టెంబర్ వరకు మీరు ఎవరికి అప్పులు ఇవ్వకండి.
ఈ ఏడాది చివరి దశలో తెలియని వారి నుంచి కొంత లబ్ధి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. స్టాక్‌మార్కెట్ లేదా జూదంలో మీరు ఉన్నట్టైతే సెప్టెంబర్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. డబ్బు పొగొట్టుకునే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్టైతే వారు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో సరైన శ్రద్ధ చూపనందుకు మీరు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ తర్వాతి నుంచి మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు స్వల్ప అనారోగ్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈ సంవత్సరం డయాబెటిస్, ఊబకాయం సమస్యలను మీరు ఎదుర్కొవాల్సి రావచ్చు.
సింహంఈ ఏడాది మీకు చక్కని ఉత్సాహం, శక్తిని తీసుకువస్తుంది. మీ సంబంధాల్లో ఏర్పడిన అనిశ్చితి జనవరి చివరి నాటికి తొలగిపోతుంది. జీవితంలో మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు. సౌకర్యవంతమైన జీవితం కోసం మీరు కొంత ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం మీరు పాత సంబంధాలను తెంపుకొని కొత్త బంధాన్ని మొదలుపెడతారు. ఊహాలను కట్టిబెట్టి వాస్తవికంగా ఆలోచించి దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని మీకు సూచిస్తున్నాం. కొత్త బంధం లేదా కొత్త భాగస్వామి అన్వేషణలో మీరు దూకుడుగా ఉండకూడదని సూచిస్తున్నాం. వివాహ సంబంధ నిర్ణయాలు తీసుకునేందుకు సెప్టెంబర్ తర్వాతి కాలం అనుకూలంగా ఉంది.
ఈ ఏడాది చివరిదశలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన అవసరాల కోసం మీరు కొత్త ఆస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం మీరు కొత్త ఆస్తులు కొనుగోలు చేయదలిస్తే ఈ ఏడాది ప్రథమార్థం మీకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్-జూలై మధ్య కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది.
జూలై-ఆగస్టు మధ్య కాలంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులకు మీరు దూరంగా ఉండాలి. మీ పనుల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి విజయం సాధించేందుకు ఈ సంవత్సరం మధ్య కాలం అనుకూలంగా ఉంది. చదువులపరంగా మీ ప్రగతి నిదానంగా సాగుతుంది. కాని ఫిబ్రవరి నుంచి కొంత సాంత్వన దొరుకుతుంది. సెప్టెంబర్ తర్వాత నుంచి పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తుంది. జనవరి చివర నుంచి ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక పనిభారం మీలో బద్ధకాన్ని తీసుకువస్తుంది.
కన్య
ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు, గెలుపు ఆశలు తీసుకువస్తుంది. ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు, కానీ కుటుంబం కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు మీ సంభాషణ స్పష్టంగా ఉండాలి. అంతే కాదు ప్రతీసారి మీరే కరెక్ట్ అనే భావన తొలగించుకోవాలి. ఫిబ్రవరి తర్వాత కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. మీ ప్రేమ జీవితం కోసం మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. కొత్త సంబంధాలు ప్రారంభించదలిస్తే మీరు సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
వివాహితులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మీరు పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కానీ మీరు చేసిన పనికి తగినంత గుర్తింపు రాదు. ఫిబ్రవరి తర్వాత మీ సంతానం నుంచి అందే ఆర్థిక సాయం తగ్గిపోతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది. ఫిబ్రవరి చివరి నుంచి వారు మరింత అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ నుంచి స్నేహితులతో సమయం వృథా చేయడం ఆపాలి. చదువుల కోసం విదేశాలకు వెళ్లదలిస్తే ఈ సంవత్సరం చివరిలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం ఈ సంవత్సరం మీకు అనుకూలిస్తుంది. ఆరోగ్య చక్కగా ఉండేలా చూసుకునేందుకు మీరు సమతుల ఆహారం తీసుకోవాలి, తగిన విశ్రాంతి కూడా అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు వ్యాయామం, ధ్యానం ఆచరించండి.
తులమీ కష్టానికి తగిన ఫలితాన్ని ఈ సంవత్సరం అందుకుంటారు. కెరీర్, చదువు, డబ్బు, సంబంధాలపరంగా ఇన్నాళ్లు మీరు చేసిన ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రయాణ సమయంలో కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొంటారు. ఫిబ్రవరి తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో పూర్వీకులకు సంబంధించిన ఆస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
మీ తండ్రి నుంచి మీరు కొంత ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉంటుంది. ఆదాయ వనరులు పెంచుకునేందుకు మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కానీ సెప్టెంబర్ తర్వాత మీ ఆదాయంలో అనిశ్చితి కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు మీ వ్యవహారాలను ముందుగానే ప్లాన్ చేసుకోండి. స్నేహితులను కలుసుకోవడం బాగా తగ్గిపోతుంది. వాళ్లు కలత చెందుతారు. ఈ విషయంలో మీరు ఎవరిని తప్పుబట్టవద్దు. ఇది విధి ఆడే నాటకమని గ్రహించాలి.
ఏప్రిల్ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఏప్రిల్- జూలై మధ్య కాలంలో మీరు ప్రేమించే వ్యక్తి విషయంలో కొంత ఆందోళనకు గురవుతారు. ఇది మినహాయిస్తే మీ ప్రేమ జీవితం రమ్యంగా సాగుతుంది. ప్రేమించే వ్యక్తి లేదా జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత సన్నిహితంగా మారుతుంది. ఈ సంవత్సరమంతా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కానీ చెడు స్నేహాలకు వాళ్లు దూరంగా ఉంటే మంచిది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది.
ఈ సంవత్సరం చివరిలో రహస్య విషయాలు తెలుసుకోవాలనే కాంక్ష పెరుగుతుంది. ఈ సంవత్సరమంతా మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. ప్రయాణ సమయాల్లోనూ, సాహస కార్యాల్లో జాగ్రత్తగా ఉండాలి, గాయాలబారిన పడే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చికం
పెండింగ్ పనులన్నీ ఈ సంవత్సరం పూర్తి చేసి మీరు విజయాన్ని అందుకుంటారు. ఇది మీకు కొత్త దిశను కూడా చూపుతుంది. చుట్టుపక్కల ఉన్నవారితో మీ సంభాషణలు తగ్గుతాయి. ఫిబ్రవరి తర్వాత మీరు కొత్త వ్యక్తులను కలుసుకొని లోతైన చర్చలు, అర్థవంతమైన సంభాషణలు జరుపుతారు. సోషల్ మీడియాలో మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు మీ సంభాషణలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి.
ఖరీదైన, విలాసవంతమైన వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు. ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఖరీదైన హాబీలు నెరవేర్చుకోవడంలో మీరు విజయం సాధించినా ఆదాయ వనరులను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. వృత్తిపరంగా మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే ఈ ఏడాది చివరి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల విషయంలో మీరు ఈ సంవత్సరం అదృష్టవంతులుగా ఉంటారు.
మీరు ప్రేమించే వ్యక్తి మీ వృత్తి జీవితంలోనూ చక్కని అండగా ఉంటారు. మీరు, మీ జీవిత భాగస్వామి చక్కని అవగాహనను, అనుబంధాన్ని చూస్తారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ ఖర్చులను నియంత్రించుకోలేకపోతే అప్పు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆదాయంలో అనిశ్చితి కారణంగా మీ ఆర్థికపరమైన విషయాలను ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసొస్తుంది. కెరీర్ ఎంచుకునే విషయంలో వారు నిపుణులను సంప్రదించడం మంచిది. విద్యార్థులు సెప్టెంబర్ తర్వాత చదువు విషయంలో కొంత శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది కానీ ముక్కు, చెవులు, గొంతుకు సంబంధించిన సమస్యల బాధ అధికంగా ఉంటుంది.
ధనుస్సు
ఈ సంవత్సరం మీకు ఫలితాలు సాధారణంగా ఉంటాయి. సంతోషం, తిరస్కారం అన్ని ఏకకాలంలో చవిచూస్తారు. జీవితంగా మందకోడిగా సాగుతున్నట్టు మీకనిపిస్తుంది, కానీ ఫిబ్రవరి తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుంది. జీవితం విషయంలో మీలో సానుకూలత పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టమైన పరిస్థితులను తట్టుకునేందుకు మీ మనస్సును దృఢంగా ఉంచుకోవాలి. భాగస్వామిని మీరు నమ్మాలి. చక్కని సంబంధాలు నెరవేరేందుకు మీరు సర్దుకుపోవాలి లేదా రాజీపడాలి. మీ భాగస్వామికి తగిన అవకాశాలు ఇవ్వండి. మీ కృషితో వారి మనస్సులు గెలుచుకోవాలి. సెప్టెంబర్ తర్వాత మీ సంబంధాలు సంతోషంగా ఉంటాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో వినోదం కోసం మీరు ఖర్చు చేస్తారు. వృత్తిపరమైన పనులు నిదానంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టులపై సంతకాలు చేయడంలోనూ జాప్యం చోటుచేసుకుంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి మీ ఆదాయంలో అనిశ్చితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ముందుగా ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. ఉద్యోగులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. మీకై మీరే స్ఫూర్తిని నింపుకొని ఉత్సాహంతో పనులు పూర్తి చేయాలి.
వ్యాపారులు ఇతరులను నమ్మకపోవడం మంచిది. సామాజిక, ఆధ్యాత్మితక విషయాలపై మీరు అధిక శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం క్లిష్టంగా ఉంటుంది కాబట్టి వారు చదువుల విషయంలో చక్కని ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ సంవత్సరమంతా మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది.
మకరం
ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది, ఎదిగేందుకు మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైన లక్ష్యాలను మీరు సాధిస్తారు. మీ లక్ష్యసాధనకు అవసరమైన కొత్త వ్యూహాలు రూపొందించుకునేందుకు ఈ సంవత్సరం మీకు సాయపడుతుంది. ఈ సంవత్సరం పనిలో మీరు సృజనాత్మకత కనబరుస్తారు. ఫిబ్రవరి తర్వాత మీరు పని విషయంలో కొంత బద్ధకంగా ఉంటారు. కానీ మీ ఉత్సాహం అద్భుతాలు సృష్టిస్తుంది.
సీనియర్లు, బాసు నుంచి ఉద్యోగులు ప్రశంసలు, మద్దతు పొందుతారు. ఈ సంవత్సరం మీరు బాగా పనిచేస్తారు, కానీ మీరు స్వయం ప్రేరితంగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు కొత్తగా ఏదైనా ప్రారంభిస్తారు, కానీ మీ ప్రస్తుత నైపుణ్యం, తెలివితేటలను పెంచుకుంటే అది భవిష్యత్‌లో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి, రాజీధోరణి కీలక పాత్ర పోషిస్తుంది. భాగస్వామి విషయంలో మీరు సున్నితంగా ఉంటారు. మీ ప్రేమ, వైవాహిక జీవితం ఏప్రిల్ నుంచి జూలై వరకు అద్భుతంగా ఉంటుంది.
మీ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు ప్రాధాన్యతను తెలిపే ముఖ్యమైన ఘట్టాలు మీ జీవితంలో చోటుచేసుకుంటాయి. కెరీర్ పరంగా పెద్దల నుంచి మీరు సూచనలు తీసుకుంటే బాగుంటుంది. మార్చి నుంచి మే మధ్యకాలంలో కెరీర్‌కు సంబంధించిన అద్భుత అవకాశాలు మీకు లభిస్తాయి. మీ ప్రేమ జీవితానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది, కానీ ఫిబ్రవరి తర్వాత మీ భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు మీరు మరింత ప్రయత్నించాల్సి ఉంటుంది.
విద్యార్థులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఏకాగ్రత పెంచాల్సి ఉంటుంది. విద్యార్థులకు సెప్టెంబర్ నెల సవాళ్లమయంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సర ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ రుతువులతో వచ్చే మార్పులు మీ పై ప్రభావం చూపుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీకు మేలు చేస్తుంది.
కుంభం
ఈ సంవత్సరం కష్టాలు, విజయాలు కలగలిసి ఉంటాయి. సంబంధాల విషయంలో మీరు ఈ సంవత్సరమంతా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సమయంతో పోల్చితే చివరి మూడు నెలలు మీకు కాస్తంతా అనుకూలంగా కనిపిస్తున్నా కుటుంబసభ్యులు, సంబంధాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ సంబంధాల విషయంలో మీలో అనిశ్చితి కనిపిస్తుంది. సెప్టెంబర్ వరకు ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఆచరణాత్మకంగా ఉండేలా చూసుకోండి. ఈ సమయంలో మీరు జీవిత భాగస్వామిని ఎంచుకున్నా ఆ నిర్ణయం కూడా చెడు కావచ్చు.
మీరు ఇప్పటికే సంబంధంలో ఉంటే మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు మరింత కృషి చేయాలని సూచిస్తున్నాం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తిజీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. ప్రభుత్వ, చట్టపరమైన వ్యవహారాలకు సంబంధించిన సంక్లిష్ట వ్యవహారాలకు దూరంగా ఉండండి, లేని పక్షంలో మీ ప్రతిష్ట, మీ డబ్బు వృథా అయిపోతాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో టెక్నికల్ రంగం నుంచి మీకు మంచి ఆదాయం సమకూరుతుంది. ఫిబ్రవరి తర్వాత దానికి ఆటంకాలు ఏర్పడతాయి.
మీ లక్ష్యాలు నెరవేరేందుకు చాలా సమయం పడుతుంది కాని ఈ సంవత్సరం ద్వితీయార్థం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం మారేందుకు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. మీ వృత్తిపరమైన నెట్వర్క్ పెంచుకునేందుకు మీరు దృష్టిసారిస్తారు. కొత్తవారిని కలుసుకోవడం, సమావేశాలు, సెమినార్లకు వెళ్లడం మీకు లాభం చేకూర్చుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు సానుకూలంగా ఉంటాయి.
మీనం
అనేక విధాలుగా ఈ ఏడాది మీకు చాలా కీలకంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం అనకూలంగా సాగుతుంది. అయినప్పటికీ మీరు పరిస్థితులు మరింత వేగంగా మారాలని కోరుకుంటారు. సెప్టెంబర్ వరకు ఏదైనా ప్రారంభించేందుకు గానీ లేదా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తే ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇనుము, సిమెంట్, హెవీ ఇంజినీరింగ్ పరికరాలు లేదా భారీ వాహనాల వ్యాపారంలో ఉన్నట్టైతే ఈ సంవత్సరం మీరు అద్భుత ఫలితాలు చూస్తారు.
లక్ష్యాలు సాధించేందుకు మీరు బాగా కృషి చేస్తారు. ఘర్షణలు, అపొహలు చోటుచేసుకునే సూచనలున్నాయి కాబట్టి మీ మాటల్లో స్పష్టత, మాధుర్యం ఉండేలా చూసుకోండి. మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ మొదటి రెండు నెలల తర్వాత అది నిదానిస్తున్నట్లు మీకనిపిస్తుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం తర్వాత వివాహ సంబంధిత నిర్ణయాలు తీసుకుంటే కలిసొస్తుంది. ప్రేమించే వ్యక్తులతో మీ అనుబంధం ఈ ఏడాది చివరినాటికి బాగా బలపడుతుంది.
కుటుంబ సంతోషం కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబసభ్యులతో ఏమైన సమస్యలు ఉంటే అవి పరిష్కారమవుతాయి. ఏప్రిల్ నుంచి జులైన మధ్య కాలంలో మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గొప్పగా ప్రారంభమవుతుంది, కానీ ఫిబ్రవరి తర్వాత వారు కష్టమైన సబ్జెక్టులపై అధిక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మీరు ఒడిదొడుకులు చూస్తారు.