ETV Bharat / state

Lashkar Bonalu 2023 : ఉజ్జయిని మహంకాళి.. గళమెత్తిన భాగ్యనగరి - CM KCR and MLC kavitha At lashkar Bonalu

Ujjaini Mahankali Bonalu Festivals 2023 : సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా.. వైభవంగా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు ఈ సంవత్సరమూ.. ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి దంపతులు సహా మంత్రులు, అధికారులు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. తల్లి దీవెనలకు ప్రజలు బారులు తీరారు. నాడు గ్రామ దేవతలను పూజించే ఆచారంతో ప్రారంభమైన ఈ బోనాలు.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా మారాయి.

Secundrabad Ujjain Mahankali Bonalu
Secundrabad Ujjain Mahankali Bonalu
author img

By

Published : Jul 9, 2023, 10:43 PM IST

Secunderabad Ujjaini Mahankali Bonalu 2023 : బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుంది. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళిగా కొలువుదీరిన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోర్కెలు తీర్చే మహాశక్తిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా ఆషాడమాసంలో డప్పుచప్పుళ్లతో మహిళలు నెత్తిన బోనమెత్తి, అమ్మవారికి నైవేధ్యాలను సమర్పించడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తుంది.

CM KCR MLC Kavitha Participated in Lashkar Bonalu : అందులో భాగంగానే ఈ ఏటా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక నడక మార్గంలో ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి బోనంతో పాటు పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి దంపతులు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కుమార్తై ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బంగారు బోనంలో నైవేద్యం సమర్పించారు.

Telangana Ministers Bonalu Celebrations : ప్రభుత్వం తరఫున బోనాల ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి తొలి బోనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ సమర్పించారు.. దేశంలో పండుగలకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని.. దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బోనాల పండుగ సందర్భంగా 8,000 దేవాలయాలకు ఆర్థిక సహాయం చేసినట్లు వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి సైతం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. రెండు రోజుల పాటు ఘటాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా త్వరలో అమ్మవారి ఆశీస్సులతో మంచి పరిపాలన రాష్ట్రంలో రావాలని.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆకాంక్షించారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా వచ్చి బోనాన్ని సమర్పించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే అధికారమని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. సమాజంలో ధర్మాన్ని కాపాడుతూ.. సమసమాజ స్థాపనకు ప్రజలంతా దోహదపడాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​లు కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బోనాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు ఆస్కారం ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.