ETV Bharat / state

ఓటు విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు: తలసాని సాయికిరణ్

author img

By

Published : Mar 6, 2021, 7:30 AM IST

సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ తలసాని సాయికిరణ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Secunderabad Parliamentary Constituency In-Charge Talasani Saikiran Graduates MLC campaigned in Sanath Nagar constituency.
ఓటు విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు: తలసాని సాయికిరణ్

గ్రాడ్యుయేట్స్ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్, పద్మారావు నగర్ పార్క్​లో పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ నెల 14 న జరగనున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో విద్యారంగ సమస్యలపై ఎంతో అనుభవం కలిగి ఉన్న సురభి వాణీదేవికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని ఓటు వేసే విషయంలో పట్టభద్రులు నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ డివిజన్ తెరాస ఇంఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, పద్మారావు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్ రెడ్డి, వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఉద్యోగాల కల్పనపై భాజపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.