తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని కంటోన్మెంట్లో కూడా వర్తింపజేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని అమలుచేయడం వల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని గ్రేటర్ ప్రాంతానికి వరంగా మారిన ఎల్ఆర్ఎస్ విధానం కంటోన్మెంట్ ప్రాంతానికి శాపంగా మారిందని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు మల్లికార్జున్ తెలిపారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో వర్షాకాలంలోనూ నీటి సమస్య తలెత్తడం పట్ల బోర్డు సభ్యులు మాట్లాడే విధానం సరికాదని.. దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని మల్లికార్జున్ సవాల్ విసిరారు. కంటోన్మెంట్‌కు రావాల్సిన నిధులు, పాత బకాయిలను తీసుకురావడంలో కూడా బోర్డు సభ్యులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పదవుల్లో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ వ్యూహరచన