సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణపై... పాలక మండలి సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాసం నెగ్గడంతో రామకృష్ణ పదవిని కోల్పోయారు.
నాలుగైదు రోజుల్లో కొత్త ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటామని బోర్డు సభ్యులు తెలిపారు. ఇటీవల రామకృష్ణ తెరాసకు రాజీనామ చేయడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ ఘటన చర్చనీయాంశయమైంది.