సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. 2014-15 నుంచి 2018-19 వరకు సహాయక, ఉప, సంయుక్త, అదనపు కార్యదర్శుల ప్యానళ్లను సవరించి సీనియారిటీ ఖరారు చేయగా.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ప్రక్రియలో రిజర్వేషన్లతో పదోన్నతి పొందిన వారికి నష్టం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే పదోన్నతులు పొందిన వారికి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. రిజర్వేషన్లతో పదోన్నతి పొందిన 15 మందిలో 2019-20 ప్యానళ్లలో పది మంది సర్దుబాటు కానున్నారు. మిగతా ఐదుగురు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసింది.
మూడు అదనపు కార్యదర్శి, ఒకటి ఉప, సహాయక కార్యదర్శి పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2019 - 20 నుంచి ఉన్న ప్యానళ్ల కోసం డీపీసీలు నిర్వహించి పదోన్నతులు కల్పించేందుకు మార్గం సులువైంది. ఈ నెల 30వ తేదీన డీపీసీ సమావేశం జరగనుంది.
ఇదీ చదవండి: