నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రెండో దశ పరుగు ఈరోజు రాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు మాత్రమే నడిచే ఎంఎంటీఎస్ నేటి నుంచి రామచంద్రాపురం వరకు వెళ్లనుంది. రాత్రి 9:05 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్‌కు రాత్రి 10.59 గంటలకు, రామచంద్రాపురానికి 11.10 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుత రైళ్ల సమయాల్లో మార్పు లేదు
దీనిని పొడిగించడం వల్ల ప్రస్తుతం నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ పేర్కొన్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్, కేంద్ర సహాయ మంత్రి