రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా రెండో డోసు పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. పలు చోట్ల వ్యాక్సినేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కోవాగ్జిన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఒక్కో కేంద్రానికి 300మందికి పైగా లబ్ధిదారులు తరలివచ్చారు. జిల్లాలోని మిగతా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవీషీల్డ్ అందుబాటులో ఉంచారు.
ఒక్కో కేంద్రంలో 200మందికే టోకెన్లు ఇచ్చి వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రెండో డోసు టీకా కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం 6 గంటలకే వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు చేరుకుని వరుసకట్టారు. మరికొన్ని కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కరోనా టీకా తీసుకోవచ్చా..?