ETV Bharat / state

కొనసాగుతున్న వ్యాక్సినేషన్... బారులు తీరిన ప్రజలు - కరోనా టీకా రెండో డోసు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా రెండో డోసు పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. పలు చోట్ల వ్యాక్సినేషన్‌ కోసం ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేస్తున్నారు.

second-dose-vaccination-in-telangana
కొనసాగుతున్న వ్యాక్సినేషన్... బారులు తీరిన ప్రజలు
author img

By

Published : May 25, 2021, 2:07 PM IST

కొవిడ్​ టీకా రెండో డోసు పంపిణీ తెలంగాణలో ముమ్మరంగా సాగుతోంది. పలు చోట్ల వ్యాక్సినేషన్‌ కోసం ప్రజలు బారులు తీరారు. హైదరాబాద్‌ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వ్యాక్సినేషన్ కేంద్రంలో రెండో డోసు కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కో కేంద్రంలో 200 మందికి మాత్రమే టీకా వేసేందుకు టోకెన్లు ఇవ్వగా.. మిగతా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్​లో నిలబడితే... వ్యాక్సిన్ వెయ్యకుండా పంపడం సరికాదన్నారు. కనీసం లైన్​లో నిలబడినందుకైనా రేపటి కోసం టోకెన్లు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్

టోకెన్ల కోసం ఎగబడ్డారు..

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రెండో డోసు టీకా కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం 6 గంటలకే వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు చేరుకుని వరుసకట్టారు. వ్యాక్సిన్ కోసం ఖమ్మంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఖమ్మం అర్బన్‌ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తుండటంతో ఉదయం 6 గంటల నుంచి బారులు తీరారు. ఖమ్మం వెంకటేశ్వరనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద టీకా వేయించుకునేందుకు 45 ఏళ్లు పైబడిన వారు భారీగా తరలివచ్చారు. రోజుకు 100 మందికి మాత్రమే టీకా వేస్తుండటంతో టోకెన్ల కోసం ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు పడి సామాజిక దూరం పాటించకపోవడంతో... పోలీసులు వారిని అదుపు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

పెద్దపల్లి జిల్లా మంథనిలో కరోనా టీకా రెండో డోసు కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. కొవీషీల్డ్ టీకా కోసం వరుసలో నిల్చొన్న చాలా మంది... తీరా ఆ టీకా వేయడం లేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. సామాజిక వైద్యశాలలో టెస్టులు, టీకాలు ఒకేచోట వేస్తుండటంతో... ఆ ప్రాంతం రద్దీగా మారిపోయింది.

ఇదీ చూడండి: నిమ్స్​లో రోగులకు మంత్రుల మనోధైర్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.