హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ (ఆదాయపు పన్ను శాఖ) రోండోరోజూ దాడులు చేస్తోంది. నగరంలోని ఆర్.ఎస్.బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్‌లో రెండో రోజూ ఐటీ సోదాలు చేపడుతోంది. ఇప్పటికే పలు పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు... సోదాలు నిర్వహిస్తున్నారు. హానర్స్ స్థిరాస్తి వ్యాపార సంస్థలో ఆర్ఎస్ బ్రదర్స్ పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. టర్నోవర్‌కు ఆదాయపన్ను చెల్లింపునకు తేడా ఉన్నట్లు ఐటీ అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం సృష్టించగా.. ఇప్పుడు ఐటీ శాఖ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: