ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జిల్లాల్లోనే ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగినట్లు తెలిపింది. అనుమతి ఇచ్చే వరకూ వాటి తుది ఫలితాల ప్రకటన నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రెండు జిల్లాలో ఎన్నికల తీరుపై ఆయా కలెక్టర్లును నివేదికలు పంపాలని ఆదేశించింది. వాటిని పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏకగ్రీవాల నేపథ్యంలో.. వైఫల్యాలు బయటపడితే చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది.
ఇదీ చూడండి: సినీఫక్కీలో చోరీ... తాళ్లతో కట్టేసి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!