ETV Bharat / state

ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా కొవిడ్ నిబంధనలు: ఎస్ఈసీ

మినీ పురపోరు సందర్భంగా కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పటిష్ఠంగా ఏ మాత్రం ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్పిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Apr 29, 2021, 8:35 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి

పోలింగ్, కౌంటింగ్ రోజులలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని... పోలింగ్ కేంద్రాల పరిసరాలను ముందు రోజు, పోలింగ్ రోజు శానిటైజ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రవేశించే ముందు, బయటికి వెళ్లే ముందు చేతులను శానిటైజ్ చేసుకోవాలన్న ఆయన... ఇందుకోసం ఓ ఇన్​ఛార్జ్​ను నియమించడంతో పాటు శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భౌతికదూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల బయట వలయాలను మార్క్ చేయాలని పేర్కొన్నారు. ఓటర్లు భౌతికదూరం పాటించేలా పర్యవేక్షణకు ఒక పోలీస్ కానిస్టేబుల్​ను నియమించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం లోపల సిబ్బంది, ఏజెంట్ల సీటింగ్ భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది, పోలీస్ సిబ్బంది విధిగా మాస్క్​లు, ఫేస్​షీల్డులు, గ్లౌజులు ధరించాలని... వీలును బట్టి ఎన్-95 మాస్క్ లేదా రెండు మాస్కులు ధరించాలని తెలిపారు. ఎవరైనా సిబ్బంది అనారోగ్యంగా ఉన్నట్లైతే పోలింగ్ విధులు కేటాయించరాదని పార్థసారధి చెప్పారు. పోలింగ్, పోలీస్ సిబ్బందిని తరలించే వాహనాల సీటింగ్ కెపాసిటీలో సగం మాత్రమే అనుమతించాలని తెలిపారు.

ప్రతి మున్సిపాల్టీలో హెల్త్ నోడల్ అధికారులు..

కొవిడ్ నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం ప్రతి మున్సిపాల్టీలో ఒకరు లేదా ఇద్దరు హెల్త్ నోడల్ అధికారులను నియమించాలని... ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు ఆరోగ్య సిబ్బంది అవసరమైన మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో పెద్ద షామియానాలు ఏర్పాటు చేసి అందులో భౌతిక దూరం పాటించేలా ఓటర్లకు కుర్చీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. ప్రతి రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల వద్ద అవసరమైన అంబులెన్సులను ఆక్సిజెన్ సిలిండర్​లతో సిద్ధంగా ఉంచాలని అన్నారు. పోలీస్, పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి పరిశుభ్రమైన సురక్షిత ఆహారం, రక్షిత త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

అవసరమైతే 144 సెక్షన్..

పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో గుంపులుగా ఉండకుండా చర్యలు చేపట్టాలని, నలుగురికంటే ఎక్కువ మంది ఒక్క చోట చేరకుండా చూడాలని అన్నారు. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని పార్థసారధి చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ లు విశాలమైన గదుల్లో ఏర్పాటు చేసి ముందుగా శానిటైజ్ చేయాలని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోనూ పూర్తి నిబంధనలు పాటించాలని... జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న ఏ ఒక్కరినీ కౌంటింగ్ హాల్​లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. లెక్కింపు అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారాదని... రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన ధ్రువపత్రం అందుకునేందుకు అభ్యర్థితో పాటు మరొకరిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది అందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.