ETV Bharat / state

'రమేశ్​కుమార్​ను ప్రభుత్వం తొలగించలేదు' - news on former sec ramesh kumar

ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్​పై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ( ఎస్ఈసీ ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని కొత్తగా ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్ హైకోర్టుకు నివేదించారు.

sec-kanagaraj-on-former-sec-ramesh-kumar
రమేశ్​కుమార్​ను ప్రభుత్వం తొలగించలేదు
author img

By

Published : Apr 28, 2020, 11:50 AM IST

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పదవి నుంచి రమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం తొలగించలేదని, ఆర్డినెన్స్‌ ద్వారా చట్టంలో మార్పు తీసుకురావటం వల్ల ఆయన పదవిని కోల్పోయారని... కొత్త ఎస్‌ఈసీ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌పై రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని అన్నారు.

మిగిలిన పిటిషనర్లు ఓటర్లు లేదా ఎన్నికల బరిలో అభ్యర్థులవుతారన్నారు. ఈ నేపథ్యంలో ఫలానా వ్యక్తి ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వర్తించాలని అడిగే హక్కు వారికి లేదన్నారు. ఆర్డినెన్స్‌, జీవోలను సవాలు చేస్తూ రమేశ్‌కుమార్‌, మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాల్లో జస్టిస్‌ కనగరాజ్‌ హైకోర్టులో కౌంటర్‌ వేశారు.

‘రక్షణ కల్పించాలని కోరుతూ రమేశ్‌కుమార్‌ కేంద్రానికి లేఖ రాసినట్లు రెండు వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆ లేఖకు సంబంధించిన ఫైల్స్‌ లభించడం లేదు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 54,594 నామినేషన్లు దాఖలు కాగా... కేవలం 0.078శాతం నామినేషన్ల వ్యవహారాల్లోనే ఫిర్యాదులు అందాయి. మున్సిపల్‌ ఎన్నికల విషయానికొస్తే 15,185 నామినేషన్లు దాఖలయ్యాయి.

వీటికి సంబంధించి 0.092శాతమే ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల్ని వాయిదా వేస్తూ రమేశ్‌కుమార్‌ ఇచ్చిన ప్రకటనలో కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు, సలహాలను ప్రస్తావించలేదు. ప్రభుత్వం ఆర్డినెన్స్‌ హడావుడిగా, గోప్యంగా ఇచ్చిందనడం సరికాదు. రమేశ్‌కుమార్‌ను తొలగించడం కోసం ఇచ్చారనడం చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదు. గవర్నర్‌ సంతృప్తి చెందాకే ఆర్డినెన్స్‌ ఇచ్చారు. అది శాసన విధి. ఆ చర్యకు ఆరోపణలు ఆపాదించడానికి వీల్లేదు.

లాక్‌డౌన్‌ సందర్భంగా రాష్ట్ర సరిహద్దులు మూసేసిన వేళ చెన్నై నుండి తనను హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి బాధ్యతలు స్వీకరించేందుకు వెసులుబాటు కల్పించిందనే విషయాన్ని... బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారిగా రమేశ్‌కుమార్‌ తప్పుపట్టడం సరికాదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాల్ని కొట్టేయండి’’ అని జస్టిస్‌ కనగరాజ్‌ కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.