Season 10 Formula-E Race in Hyderabad : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ప్రాంతం మరోసారి రయ్ రయ్ మంటూ కార్ల శబ్దాలతో హోరెత్తనుంది. సీజన్ 10 ఫార్ములా- ఈ రేస్(Car Racing in Hyderabad) అంతర్జాతీయ పోటీలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, సచివాలయం, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను మరోసారి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్లపై డివైడర్లను కూడా ట్రాక్‌కు అనుకూలంగా మార్చుతున్నారు. మొదటగా నవంబర్ 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నిర్వహించనున్నారు. దాని తర్వాత 2024 ఫిబ్రవరి 10న సీజన్ 10 ఫార్ములా- ఈ రేస్ అంతర్జాతీయ పోటీలు జరగనున్నాయి.
Formula-E Car Racing in India : ఈ కార్ రేసులను దృష్టిలో పెట్టుకొని ఈ రహదారికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఐఆర్ఎల్(IRL)కు 4, 5 రోజుల ముందు నుంచే ఎన్టీఆర్ మార్గంలో ట్రాఫిక్ అంక్షలు అమలు చేయనున్నారు. స్ట్రీట్ సర్క్యూట్ ఇరువైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. కార్ల షెడ్లు, పార్కింగ్, సదుపాయల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లుతో పాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొదట ఐఆర్‌ఎల్‌కు తాత్కాలింగా ఏర్పాట్లు చేసినా.. ఫార్ములా ఈ రేసింగ్ కోసం మాత్రం పకడ్బంది ఏర్పాట్లు చేయనున్నారు. కారు రేసింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్లాన్ చేసుకోండి.. డిసెంబర్ 10,11 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్-2
Season 10 Formula-E Race Schdule 2023 : ఫార్ములా ఈ సీజన్ 10 టెస్ట్ ఈనెల 23 తేదీ నుంచి 27 వరకు స్పెయిన్‌లో జరగనుంది. మొదటి రేస్ మెక్సికోలో 2024 జనవరి 13న జరగనుంది. చివరి రేసింగ్ లండన్‌లో 2024 జులై 21 తేదీన నిర్వహించనున్నారు. సీజన్ 10లో స్పెయిన్, మెక్సికో, ఇండియా, సౌదీ అరేబియా.. బ్రెజిల్, జపాన్, ఇటలీ, మొనాకో, జర్మనీ, చైనా, అమెరికా, యూకేలో నిర్వహించనున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ గతంలో వచ్చినట్లుగానే.. దేశ, విదేశీ పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఈసారి మరింత ఎక్కువ మంది కార్ రేసింగ్(Car Racing)లో పాల్గొనున్నట్లు.. హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. 2022 డిసెంబర్లో ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్‌లో జరగగా.. 2023 ఫిబ్రవరి 11 తేదీన ఫార్ములా- ఈ కార్ రేస్ నిర్వహించారు. ఫార్ములా రేసింగ్ అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి.. సందడి చేశారు. సినీ తారలు, కథానాయకులు, రాజకీయ నాయకులు.. ప్రముఖులు వచ్చి ఈ రేసింగ్‌ని తిలకించారు.
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్.. ప్రాక్టీస్ రేస్-1 షురూ
హైదరాబాద్‌లో మొదటి రోజు ముగిసిన కార్ రేసింగ్.. మళ్లీ అవే తప్పిదాలు!
భాగ్యనగరంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియా కార్ రేసింగ్ లీగ్