Scrub typhus cases in hyderabad : హైదరాబాద్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ‘చాపకింద నీరు’లా పాకుతోంది. కొన్ని రోజుల వ్యవధిలో గాంధీలో 15 మంది ఈ స్క్రబ్ టైఫస్ లేదా బుష్ టైఫస్‌కు చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉంటున్నారు. ఈ నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
ఎలా సోకుతుంది...
ఇళ్లలో, పెరటి మొక్కల్లో, చిత్తడి ప్రాంతాల్లో ఉండే నల్లి వంటి చిన్న పురుగులు(లార్వల్ మైట్స్) కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇళ్లలో మంచాలు, తడి ప్రాంతాల్లో ఈ పురుగులుంటాయి. నల్లుల మాదిరి తిరుగాడుతుంటాయి. ఎక్కువగా రాత్రి సమయాల్లో కుడుతుంటాయి. ఫలితంగా తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలుంటే సత్వర చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: హెచ్ఐవీ బాధిత మహిళ శరీరంలో ఒమిక్రాన్ పుట్టుక!