రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుపోతుందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్‌లోని పామ్ స్ప్రింగ్స్ మోటార్స్ సహాకారం నలుగురు క్రీడకారులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేశారు.
బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్, తైక్వాండో క్రీడాకారుడు శివ కిరణ్, తైక్వాండో నేషనల్ మెడలిస్ట్ స్వరూప్ కిరణ్, తైక్వాండో కోచ్ సురేందర్ సింగ్‌లకు స్కూటీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పామ్ స్ప్రింగ్స్ మోటార్స్ ఎండీ విద్యా సాగర్, డైరెక్టర్లు మల్లికార్జున్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, ఆంజనేయ ప్రసాద్, శ్రీనివాస్ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, నటి రష్మీ ఠాకూర్, తైక్వాండో గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వానాకాలం ధాన్యం కొనుగోలుకు 6000 కేంద్రాలు: మంత్రి గంగుల