మూఢ నమ్మకాలను వీడి వైజ్ఞానిక తెలంగాణను నిర్మించుకోవాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు రమేశ్ అన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు జనవిజ్ఞాన వేదిక.. మూఢ నమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో వైజ్ఞానిక సభను నిర్వహించారు.
చంద్రయాన్‌తో విను వీధుల్లోకి దూసుకెళ్తూ అంతరిక్ష రహస్యాలను శోధిస్తున్న కాలంలో ఇప్పటికీ సమాజంలో మూఢనమ్మకాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవడం బాధాకరమన్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై ప్రజలు అతిగా భ్రమలో ఉండడం మూలంగా ధన , ప్రాణ నష్టాల బారిన పడుతున్నారన్నారు.
మంత్ర తంత్రాల బండారాల గుట్టురట్టుపై ఆట, పాట, మాటలతో వివిధ రకాల ప్రదర్శనలతో విద్యార్థులకు కళ్లకు అద్దిన్నట్లు ప్రదర్శించారు. మూఢనమ్మకాల నిర్మూళనపై తెలంగాణలో చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తరహాలో మన రాష్ట్రంలో చట్టాన్ని తీసుకొస్తే ప్రజలను చైతన్యవంతులను చేయడం సాధ్యపడుతుందన్నారు. ఈ ప్రదర్శనలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జలసిరిని చూసి పరవశించి పోయా: సీఎం కేసీఆర్