ETV Bharat / state

Weather Report: రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - Weather Report

Weather Report: తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Weather
Weather
author img

By

Published : Apr 16, 2022, 2:10 PM IST

Weather Report: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది. అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టంకు సగటున 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: Bandi Sanjay Letter To Kcr: 'సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం పాలమూరుకు రండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.