హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయను జాతీయ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్ ఘనంగా సన్మానించింది. బడుగు బలహీన వర్గాలకు జరిగే సన్మాంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి ప్రవేశ పెట్టిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వెనుకబడిన తరగతుల వారికి కల్పించిన హక్కుల పరిరక్షణకు గవర్నర్‌గా తనవంతు కృషిచేస్తానని తెలిపారు. సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.
ఇదీ చూడండి: బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం