తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన ఆరుగురు అక్కచెల్లెళ్లకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అండగా నిలిచారు. ట్విట్టర్లో ట్వీట్‌కు స్పందించిన ఎర్రోళ్ల శ్రీనివాస్... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వెల్ఫేర్ అధికారులతో స్వయంగా మాట్లాడారు. ఉమ్మడి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కేంద్రంలో ఆ ఆరుగురికి ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు. ఉన్నత చదువులకు,అన్ని రకాలుగా అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని ఎలకలపల్లి గ్రామానికి చెందిన... తోటపల్లి రాజం, రాజ్యలక్ష్మీ దంపతులకు ఐశ్వర్య(16), మానస(14), హారిక(13), మౌనిక (12), హరిణి(10), స్వేచ్చ శ్రీ(6) ఆరుగురు ఆడపిల్లలు.
గత ఏడాది తండ్రి రాజం అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రిని కోల్పోయి ఏడాది తిరగకముందే తల్లి రాజ్యలక్ష్మీ గత వారం చనిపోయింది. దీంతో వారు దిక్కులేని వారిగా ఆశ్రయం కోల్పోయారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఛైర్మన్.. జిల్లాకు చెందిన వెల్ఫేర్ అధికారులతో స్వయంగా మాట్లాడారు. వీరి ఉన్నత చదువులకు,అన్ని రకాలుగా అండగా నిలబడతానని భరోసానిచ్చారు. స్పందించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆ అక్కాచెల్లెళ్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
-
#తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన ఆ ఆరుగురు అక్కచెల్లెల్ల కు అండగా ఉంటాను. ఆసిఫాబాద్ జిల్లా వెల్ఫేర్ అధికారితో మాట్లాడడం జరిగింది. ఉమ్మడి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కేంద్రంలో ఆ ఆరుగురికి ఆశ్రయం కల్పించాలని ఆదేశాలు. మీరు అధైర్యపడవద్దు. మీ చదువులకు నేను బరోసాగా ఉంటాను.@TelanganaCMO https://t.co/kOH2TzvwGx
— Dr.Errolla Srinivas (@DrErrolla) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన ఆ ఆరుగురు అక్కచెల్లెల్ల కు అండగా ఉంటాను. ఆసిఫాబాద్ జిల్లా వెల్ఫేర్ అధికారితో మాట్లాడడం జరిగింది. ఉమ్మడి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కేంద్రంలో ఆ ఆరుగురికి ఆశ్రయం కల్పించాలని ఆదేశాలు. మీరు అధైర్యపడవద్దు. మీ చదువులకు నేను బరోసాగా ఉంటాను.@TelanganaCMO https://t.co/kOH2TzvwGx
— Dr.Errolla Srinivas (@DrErrolla) August 21, 2020#తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన ఆ ఆరుగురు అక్కచెల్లెల్ల కు అండగా ఉంటాను. ఆసిఫాబాద్ జిల్లా వెల్ఫేర్ అధికారితో మాట్లాడడం జరిగింది. ఉమ్మడి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కేంద్రంలో ఆ ఆరుగురికి ఆశ్రయం కల్పించాలని ఆదేశాలు. మీరు అధైర్యపడవద్దు. మీ చదువులకు నేను బరోసాగా ఉంటాను.@TelanganaCMO https://t.co/kOH2TzvwGx
— Dr.Errolla Srinivas (@DrErrolla) August 21, 2020
ఇవీ చూడండి: ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలంటూ సీఎంకు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ